వెనుకటికేవడో చదవక ముందు కాకర కాయ అనేవాడు చదువుకున్నాక కీకర కాయ అన్నాడట.అలా వుంది లాప్ టాప్ లు తయారుచేసేవారి పరిస్తితి .ఎంతసేపుటికి ఎంత మెమరీ పెంచుదామా అనే గోల తప్పితే చీకటి లో లాప్ టాప్ కీ బోర్డ్ కనిపించదు కదా అని ఆలోచించలేదు. సెల్ ఫోన్ కి మాదిరిగానే లాప్ టాప్ కి కూడా కీ బోర్డ్ కి లైట్ వుంటే బావుంటుంది కదా ఆలోచించండి.............................

అవును మహా ప్రళయం సంభవించబోతుంది రానున్న కాలం లో .అది ఏమిటి అనుకుంటున్నారా ?ఆహార కొరతమనిషి ఒకప్పుడు అన్ని జంతువులు లాగానే వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవాడు . తరువాత తన బుద్ధి నివుపయోగించి భూమి నుంచి ఆహారాన్ని పండిచటం నేర్చు కున్నాడు .ప్రపంచం లో మూలకు వెళ్ళినా మనిషి తినేప్రతి వస్తువు యొక్క ముడి పదార్ధం భూమి లోనించి వచినదే .మరి అలాంటి మనిషి భూమి ని వదిలేసి ఉద్యోగాలువ్యాపారాలు అంటూ పరుగులు పెడుతున్నారు.అందరు తింటూ కూర్చుంటే మరి పండించేది ఎవరు.గత పదిసంవస్తరాల నుంచి పెత్తనానికి వచ్చిన యువత వ్యవసాయాన్ని వదిలేసారు.ఏదో కొద్దిమంది గ్రామాలలో వ్యవసాయంచేస్తున్నారు ,వాళ్ళ తరువాత ఎవరు వ్యవసాయం చేస్తారు?ఇక అపుడు అంబానీలు లాంటి వాళ్ళు చేయాల్సిందేఅపుడు ఏముంది మళ్లీ కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలోకి మానవ జాతి వెళ్ళిపోతుంది .ఎక్కడనుంచిమొదలయమో అక్కడికే చేరుకుంటాము .ఇదేనా మనం కోరుకుంటున్నది?

సామాన్య జనం ఇటువంటి సమస్యల గురించి ఆలోచించలేరు ఎందుకంటే పాపం వాళ్ళకి ఎన్నో కష్టాలు వుంటాయిఇంజనీరింగ్ కి అప్పుతెచిన డబ్బు కట్టాలి ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేస్తే ఎవరు పిల్లని ఇవ్వరు,అంట దాకఎందుకు పండగ కి ఇంటికి వెళ్తే ఏరా అబ్బాయ్ ఇంకా రాలేదా అంటారు (ఏంటిది వచ్చేది ?వుద్యోగం).సో ఇలా గంపెడుకష్టాలతో ఈనాటి యువత వ్యవసాయం చేయలేకపోతుంది.

మరి దీనికి పరిష్కారం ఏమిటి? సమస్య అయిన మేధావుల వలన సాధ్యం అవుతుంది . దేశం లో వున్నఅత్యున్నత విశ్వ విద్యాలయాలు దీని గురించి ఆలోచించాలి ఒక ప్రయోగాత్మకం వ్యవసాయాన్ని చేపట్టాలి .అపుడుదీనికి కొంత వరకు పరిష్కారం దొరకవచు. ఆదర్శం ఆలోచించే యువత ఎంతో మంది వున్నారు కాని వారినిముందుంది నడిపించే వారె కావాలి.

వ్యసనాలకు లోనయినవాడు అందులోనుంచి బయటకు రాలేనట్లు ఉద్యోగాల పిచి లో పడ్డ వాళ్ళు అదేదో స్వర్గంఅనుకుంటున్నారు కానే కాదు.తాత్కాలిక సుఖాలకి అలవాటుపడి మన మనుగడను మనమే కజేసుకుంతున్నాం.
మరి కొంతమంది అనుకోవచు చదువుకుంటున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం తప్పేమిటి అని .వాళ్ళ గురించి కాదుఇక్కడ చెప్తున్నది కాని ఎంతో మంది డ్రాప్ అవుట్స్ కూడా ఇతర ఇతర పనుల వయిపు మొగ్గు చూపుతున్నారుదయచేసి ఇలాంటి వాళ్ళు అందరు కూడా వ్యవసాయం వైపు వెళితే బావుంటుంది.

వ్యవసాయం అవమానం కాదు గౌరవం.

స్త్రీ ని ప్రేమించండి ,గౌరవించండి వీలు అయితే పూజించండి .అంతే కానీ స్త్రీ మీద ఆధార పడవద్దు .ఎందుకంటే స్త్రీ కి తనగురించి ఆలోచించటం తప్పితే పక్క వాళ్ళ గురించి ఆలోచించే స్వభావం తక్కువ .అంటే ఏదో దేశాన్ని ఉద్ధరించమని కాదుతన అనుకున్నవాళ్ళ గురించి అన్నమాట. చూడండి తన కొడుకేమో బంగారం మరిది గారి కొడుకో లేక బావ గారి కొడుకేమో ఉత్తవెధవ ఎందుకు? వాళ్ళ అమ్మ గారు అంటే ఈవిడకి పడదు (ఇద్దరు స్త్రీ మూర్తులే).

ఒకరిని నిందించ గానే ఇంకొకరి తో పోల్చటం సహజం .స్త్రీ గురించి చెప్పగానే పురుషుడి గురించి ప్రస్తావిస్తారు.కాని తేడావుందండి స్త్రీ కి పురుషుడికి శాస్త్ర పరంగా మరి ప్రకృతి పరంగా ఇంకా సామాజికం .ఇటువంటి అసమానతలు వున్నపుడువాళ్ళ మీద ఆధార పడ్డ వారు కొంచం ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది .అలంటి ఇబ్బందు లు రాకుండా మీరుఅందరు ఎవరి బాధ్యతలు వారె నిర్వర్తించుకుంటే బావుంటుంది .

ఈ మధ్య బాగా బోర్ కొట్టి ఏదైనా మూవీ కి వెళ్దామని ఇటీవల వచ్చిన ఏ మాయ చేసావే అనే సినిమా కి వెళ్ళాను .వో కుర్రాడు కుర్రదాని వెంటపడుతుంటాడు .ఏంటి ఆ అమ్మాయి ఏమో పటించుకోదు వీడ్ని చూస్తేనేమో మన కాలేజీ డేస్ లో మనం పడ్డ తిప్పలు గుర్తువస్తాయి ఏదో ఎక్కడో మనకి టచ్ అవుతునట్లు అనిపిస్తుంది. ఉన్నట్లుండి కుర్రాడు ఒక రోజు ఐ లవ్ యు అంటాడు ,చాల క్లియర్ గ స్పష్టం గ చెప్తాడు.ఇక్కడ కుర్రాడి వాకింగ్ స్టైల్ వావ్ .కుర్రది అర్ధం కాకుండా చెప్తుంది ..కట్ చేస్తే ..

కుర్రాడికి కొంచం క్లారిటీ వచాక వెంటపడటం ఎక్కువ అవుతుంది ఇక్కడ మొదలవుతుంది దర్శకుడి ప్రతిభ ,ఫ్రెండ్స్ లాగా వాళ్ళు మాట్లాడుకునే మొదటి సీన్ మన మనసులని గిలిగింతలు పెడుతుంది.వీడేంటి రా బాబు అలవోక గ తనని ట్యూన్ చేస్తున్నాడు అనిపిస్తుంది.మెల్లగా ఇద్దరు దగ్గరవుతారు. ఈలోపు కుర్రదానికి మళ్లీ మెంట లెక్కి ఇంకొకరి తో పెళ్ళికి రెడీ అయిపోతుంది .ఇపుడు కూడా కుర్రాడి లో అదే స్పష్టత, వెళ్లి చేసుకోమంటాడు.

సరే పాపం కుర్రది కూడా మనసు చంపుకోలేక పెళ్లి చెడ కొడుతుంది.ఇక్కడ మొదలవుతుంది అండి.తనని కలవడానికి వచ్చిన ప్రియుడికి ప్రియురాలు ధైర్యం చెప్పి సాగనంపిన తీరు ఆహా అది మాటల లో వర్ణించలేము ఇక్కడ వాళ్ళిద్దరూ వెళ్లి పోతారని అందరు అనుకుంటారు కాని అల జరగదు ఆ తరువాత రక రకల మలపులు తిరిగి ఐదారు ఒకటి అవుతరనుకోండి.

ఆకట్టుకున్న విషయాలు ఏమిటి అంటే సంగీతం,హీరో నటన ,అద్భుతమైన దృశ్యాలు.

అదేనండీ ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు కదా, మంచి ఆరోగ్యం పొందండి భాగ్యవతులు కండి .ఇలా చెబితే ఏముంది లే అని నాలుక చప్పరించేస్తారు చాలామంది కానీ ఆసుపత్రి కి వెళ్లి బిల్లు తడిసి మోపెడయినపుడు కానీతెలియదు ఆరోగ్యం విలువ .
ఇక విషయం లోకి వద్దాం .ఆరోగ్యం కోసం మరియు నాజూకు గా వుండడం కోసం మనలో చాలామంది చాలా రకాలప్రయత్నాలు చేస్తూవుంటాం .
కొంతమంది ఫలితం సాధిస్తారు మరి కొంత మంది ఫలితం కనపడక విరమించుకుంటారు .ఇలా నిరాశ పడే వారికినేను కొన్ని విషయాలు చెప్తాను పాటించండి. మాత్రం కష్ట పడకుండా అన్ని రుచులు ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యం ఉండవచు . క్రింది నియమాలు ఖచ్చితం పాటించవలెను

.ఆకలి అయినపుడు మాత్రమే తినండి (ఏమయినా తినండి).వినడానికి ఇది సింపుల్ గా ఉన్నా ఆచరించి చుడండిమీకే అర్ధం అవుతుంది.ఆకలి లేనపుడు అసలు ఏమీ తినవద్దు

. బిర్రు తినకుండా ఇంకా తినగలము కొంచం ఖాలీ ఉంది పొట్టలో అనుకోగానే ముగించండి .

. రోజు లో ఒక్క పూట (లంచ్)మీకు ఇష్టమైనవి తినండి మిగత రెండు పూటలా కొంచం నియమం తినండి (అంటే ఉదయంఅయితే ఆయిల్ తక్కువ టిఫిన్ like ఇడ్లి,సాయంత్రం అయితే ఫ్రూట్స్ పుల్కా అలా.........)దీని వలన మీరు రోజులతరబడి ఉగ్గపట్టుకుని ఉండవలసిన అవసరం లేదు .

నోట్ : ఇవి అన్ని ఏదో పెద్దవారికి చెప్తునాను అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే .ఇది అంతా యూతు కిఎందుకంటే పాకే మొక్కకి పందిరి వేయాలి గాని (సరిగ్గా అల్లుకోవాడని కి) పెనవేసుకు పోయిన దానికి ఎందుకండీ

అరె ఎందిరన్న ఇది ఏమి బందు రన్న .కొడితే పగిలి పోవాలి .పనులు ఉన్న వాళ్ళందరూ బయటకు రావటానికి జడుసుకోవాలి.రోడ్లు అన్ని క్రికెటు వికెట్ల తోనిండిపోవాలి అదీ బందు అంటే .ఇది ఏంది రా బాబు కుకట్ పల్లి అమీర్ పెట్ లో అయిదు నిముషాలు వాహనాలుట్రాఫిక్ జం అయాయి ఈరోజు కూడా. సాఫ్ట్వేర్ కంపనీ లు అన్ని పని చేసాయి .రోడ్లు మీద జనం యధేచ్ఛ తిరిగారు ఇన్ని మాటలు ఎందుకు రోజు దిన చర్య ఎలా జరిగిందో చెప్తాను వినండి .

పొద్దునే నిద్ర లేచి వెళ్లి పాల ప్యాకెట్ ,పేపర్ తెచాను .ఆఫీసు కి బయలుదేరి దారిలో ఒక మసాల దోస తిన్నాను పక్కనేఉన్న టీ షాప్ లో టీ తాగాను .ఇక ఆఫీసు కి తొమ్మిదికల్లా వెళ్లి అబ్బ బందు పుణ్యమా అని ఈరోజు అందరికంటే నేనుముందుగ వచాను అనుకుంటూ ప్రవేశించాను ,పెద్ద షాక్ తగిలింది అందురు నాకంటే ముందుగానే ఆఫీసు లోవున్నారు .మద్యానం మెస్సు కి వెళ్లి సుష్టు గ భోజనం చేశాను

ఇదే నా బందు చేసే పద్దతి, దేనికయినా ఒక పర్ఫెక్షను వుండల్ర బాయ్ గిట్లయితే తెలంగాణా వచినట్లే .................? కనీసం రేపు అన్న కాస్త బందు నిబంధనలు పాటిస్తారని అశిస్తూ......................................
.

అతిథి దేవో భవ అన్నారు .మనం హోటల్ కి వెళ్ళినా లేక చుట్టాల ఇంటికి వెళ్లినా చేతులు కడుకోవటానికి నీలు ఇచ్చితరువాత ఏమైనా తినడానికి పెడతారు.అటువంటిది మధ్య నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను .అక్కడ ఫుడ్ బావుంటుందని తెలిసినవాళ్లు చెబితే చూద్దాము ఎలా వుంటుందో నని వెళ్ళాను.అక్కడ చాల బాగా రిసీవ్ చేసుకున్నారుఏమి కావాలని అడిగారు ,ఆర్డర్ చేశాను .తినబోతూ చేతులు శుభ్రం లేవని వాష్ బేసిన్ ఎక్కడ అని అడిగాను .అదిఏమిటి అన్నట్లు వింత చూసారు నా వంక నిర్వాహకులు.నేను ఏమైనా పొరపాటు మాట్లాడనేమోనని సారి చాలస్పష్టం చేతులు సుబ్రం లేవు వాష్ చేసు కోవాలని అడిగాను.ఇక్కడ అలాంటి సదుపాయం లేదనిచెపారు.తెల్లబోవడం నా వంతు అయింది.వందలు వందలు వసూలు చేస్తూ కనీసం చేతులు శుభ్రం చేసుకునేసదుపాయం కూడా లేకపోవటమేమిటి అని అనుకున్నాను.

కారణం ఎవరు పట్టించు కోక పోవటం, అడగక పోవటం.వస్తున్నారు తిన్తూన్నరు పోతునారు. సరే అలాగే తిన్నాను తిన్నతరువాత మంచి నీళ్ళు అడిగాను.లేవు అని సమాధానం .ఇదేనా మన సంస్కృతీ .పైగా అదేదో పెద్ద ఆధునిక పద్దతి లాగాతినేవాళ్ళు కూడా కో లా లు పెపిసిలు తాగడం. ఇలాంటి సంస్కృతీ లో మార్పు ఎపుడు వస్తుందో ఏమో మరి మీరేఆలోచించండి .

అనుభవం జరిగింది సబ్ వే అనే ఒక రెస్టారెంట్ లో .............................